బ్రేకింగ్ : అసెంబ్లీ సమావేశాలని బై-కట్ చేయాలని టీడీపీ నిర్ణయం

ఆఖరిరోజు అసెంబ్లీ సమావేశాలకి హాజరుకాకూడదని తెదేపా నిర్ణయించుకుంది. బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై తెదేపా అసంతృప్తిలో ఉంది. సభలో మంత్రుల తీరుకి నిరసనగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలని బైకట్ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, మండలిలో ఊహించని పరిణామాలు ఎదురుకావడం పట్ల సీఎం జగన్ అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మరికొద్దిసేపట్లో న్యాయ నిపుణులతో సమావేశం కానున్నారు.

బుధవారం ఏపీ శాసనమండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిందే. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపారు. సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాత ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీ వైపు మొగ్గుచూపారు. తనకున్న విచక్షణాధికారాలతో ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపారు. ఛైర్మన్ నిర్ణయంపై అధికార పార్టీ సభ్యులు నిరసన తెలిపారు.