తెల్ల రేషన్ కార్డు దారులు కోట్ల విలువ చేసే భూమిని ఎలా కొనుగోలు చేశారు ?

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చేలా కనిపిస్తోంది. అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిఐడి రంగంలోకి దిగింది. ల్యాండ్‌ పూలింగ్‌పై దర్యాప్తు చేప్టటింది. ఇందులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.  తెల్ల రేషన్‌ కార్డు కలిగిన 796 అమరావతిలో విలువైన భూములు కొన్నారని తేలింది.

తెల్ల రేషన్‌ కార్డు కలిగిన 796  ఎకరానికి 3 కోట్ల రూపాయిల చొప్పున 300 కోట్ల రూపాయిలతో భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. తెల్లకార్డులు కలిగిన వారితో భూములు కొనుగోలు చేయించిన వారిపై సీఐడీ ఆరా తీస్తోంది. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 129 ఎకరాలు కొనుగోలు చేసిన 131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్లు. పెద్ద కాకానిలో 43 మంది తెల్లకార్డు హోల్డర్లు 40 ఎకరాలు కొన్నారు.

తాడికొండలో 188 మంది 180 ఎకరాలు, తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు, తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు కొన్నారని సిఐడి గుర్తించింది. మరోవైపు, మాజీమంత్రులు నారాయణ, ప్రతిపాటి పుల్లారావులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. తన భూమిని బలవంతంగా లాగేసుకొన్నారని ఓ మహిళ ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు.