బీసీసీఐకి పాక్ బెదిరింపులు


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి బెదిరింపులు ఎదురుకావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ యేడాది జరగనున్న ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించాల్సిందేనని.. లేనియెడల భారత్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ని తాము బహిష్కరిస్తామని పాక్ బెదిరిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ ఓ ప్రకటన చేశారు.

టీమిండియా పాకిస్థాన్  లో పర్యటించిక 15యేళ్లు అవుతోంది. చివరిసారిగా భారత్ 2005-06 సీజన్ లో పాకిస్థాన్ లో పలు మ్యాచ్  ఆడింది. ఉగ్రవాదం ఇరు దేశాల మధ్య ఆగ్రహావేశాలు రగిలించడంతో.. ఆ ప్రభావం క్రికెట్ పైనా పడింది. దాంతో పాకిస్థాన్ కు భారత క్రికెట్ జట్టును పంపేందుకు బీసీసీఐకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలేదు. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులకు దిగింది. మరీ.. పాక్ బెదిరింపులకి భారత్ తలొగ్గుతుందా.. ? పాకిస్థాన్ కి వెళ్లి ఆసియా కప్ ఆడుతుందా ?? అన్నది చూడాలి.