రెండో టీ20లో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్ తో రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన కివీస్ మొదటి బ్యాటింగ్ చేసిండి. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి కివీస్ 132 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ బ్యాట్స్ మన్ స్వేచ్ఛగా పరుగులు తీయలేకపోయారు. భారత బౌలర్లలో జడేజా 2, బుమ్రా, దుబె, ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం 133 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఓపెనర్ కె ఎల్ రాహుల్ (57, 50బంతుల్లో, 3ఫోర్లు, 2 సిక్సులు) అజేయంగా నిలిచాడు. ఆయనకి తోడుగా యువ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ (44, 33బంతుల్లో, 1ఫోర్, 3 సిక్స్ లు) రాణించారు. ఆఖరులో వచ్చిన శివవ్ ధూబే (8 4బంతుల్లో, 1సిక్స్) అదిరిపోయే సిక్సర్ తో జట్టుని విజయతీరాలకి చేర్చాడు. స్టార్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ, కోహ్లీ తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ.. కుర్రాళ్లు రాణించడం టీమిండియా బలాన్ని తెలిపుతోంది.