సరిలేరు రిపబ్లిక్ డే ప్రోమో చూశారా ?

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అభిమానులకి సినీ స్టార్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకలు అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం పదిరోజుల్లోనే రూ. 102కోట్ల షేర్, రూ. 200కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

చాన్నాళ్ల తర్వాత మహేష్ నుంచి వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ని ఆయన అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. సరిలేరు హిట్ కిక్కులో ఉన్న మహేష్ ఫ్యామిలీ కలిసి న్యూయార్క్ టూర్ కి వెళ్లారు. తాజాగా రిపబ్లిక్ డే కానుకగా సరిలేరు నుంచి స్పెషల్ ప్రోమోని విడుదల చేశారు. మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రకి సంబంధించిన చిన్ని బిట్ సీన్ ని ప్రోమోగా వదిలారు. ఆ ప్రోమోని మీరు చూసేయండీ.. !