ఏపీ శాసన మండలి రద్దు.. మరికాసేపట్లో ప్రకటన !
శాసన మండలిని రద్దుకు సీఎం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినేట్ సమావేశం ప్రారంభం అయింది. ఇందులో ప్రధానంగా మండలి రద్దుపై చర్చించారు. ఎంతోసేపు చర్చ జరగలేదు. క్యాబినేట్ సమావేశం ప్రారంభమైన పది నిమిషాల్లోనే మండలి రద్దుపై నిర్ణయం తీసుకోవడం విశేషం. దాంతో.. అంతకంటే ముందే మండలి రద్దుపై ప్రభుత్వం కసరత్తు చేసింది. న్యాయ కోవిధుల సలహాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఉదయం 11గంటలకి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా కొన్ని బిల్లులని ఏపీ అసెంబ్లీ ఆమోదించనుంది. ఆ తర్వాత మండలి రద్దు బిల్లుని సభలో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. మండలి రద్దు అనేది కేంద్రంలో చేతిలో ఉంటుంది. దానికి మూడ్నాలుగు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. మందలి రద్దు రిస్క్ తో కూడుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న.. ఆ దిశగానే సీఎం జగన్ నిర్ణయం తీసుకోనుండటం విశేషం.