‘అశ్వద్థామ’ సెన్సార్ రిపోర్ట్


యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘అశ్వద్ధామ’. ఇది నాగశౌర్య సొంత సినిమా. ఆయనే కథ అందించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ  ఐరా క్రియేషన్స్ నిర్మించింది. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. పేరుకే ఆయన దర్శకుడు. పనంతా నాగశౌర్యదే అని తెలుస్తోంది. నాగశౌర్య కి జంటగా మెహ్రీన్ నటించింది. ఈ నెల 31న అశ్వద్ధామ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. చిన్న చిన్న కట్ ఇచ్చారు. మొత్తం నిడివి రెండు గంటల ఏడు నిమషాలు వచ్చింది. థ్రిల్లర్ సినిమాలు ఎంత షార్ప్ గా వుంటే అంత బాగుంటాయి. ఇలాంటి నేపథ్యంలో అశ్వద్ధామ సినిమా జస్ట్ రెండు గంటల నిడివి రావడం మంచి విషయమే. విశాఖ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఇటీవల ఎక్కువగా జరుగుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాల నేపథ్యంలో రాసుకున్న కథ ఇది.

ఈ చిత్రానికి గిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు.