హైదరాబాద్’లో కరోనా వైరస్.. వదంతులు మాత్రమే : ఈటెల 

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటికే 80మందికి పైగా మృతి చెందారు. వందల మందికిపైగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. చైనా నుంచి కరోనా వైరస్ ఇతర దేశాలకి వ్యాప్తించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి వచ్చే వారి పట్ల ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటోంది.
 
మరోవైపు, ఇప్పటికే కరోనా వైరస్ తెలంగాణలో వ్యాప్తించిందనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో కరానా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే, ఇందులో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం మంత్రి ఈటెల హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

హైదారాబాద్ కి కరోనా వైరస్ సోకిందనే వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు ఈటెల.  రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తోందన్నారు. ఇప్పటికే కేంద్ర బృందం హైదరాబాద్‌ చేరుకుంది. కరోనా వైరస్ పై అప్రమత్తం చేయనుంది. ఇప్పటికే హైదారాబాద్ గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రిలో కరోనా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి పెట్టారు.