వామ్మో.. మంచు మనోజ్ ని ఆ రేంజ్ లో టార్చర్ చేసిందా ?
యంగ్ హీరో మంచు మనోజ్ పెళ్లి ముచ్చట ఎత్తితేనే భయపడిపోతున్నాడు. ఇటీవలే మనోజ్ తన భార్య ప్రణీతరెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ నే ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
“నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ముగిసింది. మా ఇద్దరి మధ్య చాలా సందర్భాల్లో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోతున్నా ఒకరంటే ఒకరికి పూర్తి గౌరవం ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల నేను గతకొంతకాలంగా సినిమాలపై దృష్టి సారించలేకపోయాను. నా కుటుంబంతోపాటు స్నేహితులు, అభిమానులు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. నాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. మళ్లీ నేను సినిమాల్లో నటించనున్నా”నని గత యేడాది అక్టోబర్ లో మనోజ్ ట్విట్ చేశారు.
చెప్పినట్టుగానే మంచు మనోజ్ త్వరలోనే సినిమా ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో “ఫైర్‌బాల్‌లా మీ ముందుకు రాబోతున్నా. వారం రోజుల్లో మీకు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నా. వెయిట్ చెయ్యండి” అంటూ మనోజ్ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కు ఓ అభిమాని `ఏంటి.. ? మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?` అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మనోజ్ `వామ్మో..` అని రిప్లై ఇచ్చాడు. దీంతో మనోజ్ కు పెళ్లి అన్నా.. పెళ్లాం అన్నా.. విరక్తి కలిగినట్టు అర్థమవుతోంది. ఆ రేంజ్ లో అతడి మాజీ భార్య ప్రణతిరెడ్డి టార్చర్ చేసి ఉంటుందా ? అనే గుసగుసలు వినబడుతున్నాయి. అది ఆయన పర్సనల్ విషయం కాబట్టి.. వదిలేస్తే.. మంచిదేమో.. !