అభిమానులని నిరాశరిచిన నభా

ఇస్మార్ట్ పోరి నభా నటాషా అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నభా. ఈ సినిమాతో కమర్షియల్ హీరోయిన్ అనిపించుకుంది. గ్లామర్ పాత్రలకి ఫర్ ఫెక్ట్ అనిపించుకుంది. స్టార్ హీరోల నుంచి నభాకు ఆఫర్లు ఖాయం అనుకున్నారు. అనుకున్నట్టే.. మాస్ మహారాజా రవితేజ నుంచి నభాకి పిలుపొచ్చింది. రెమ్యూనరేషన్ లెక్కలేమీ వేసుకోకుండా రూ. 40లక్షల పారితోషికానికే డిస్కోరాజా సినిమాని చేసేందుకు ఒప్పేసుకుంది.

స్టార్ హీరో సినిమా కదా. తన రేంజ్ పెరిగిపోతుందని ఆశపడింది. కానీ, నభా ఆశలు ఫలించలేదు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన డిస్కోరాజాని సినిమాని చూస్తే.. అందులో నభాది జస్ట్ గెస్ట్ రోల్ లా అనిపించింది. దీంతో ఆమె  అభిమానులు  తీవ్రంగా  నిరాశపడ్డారు. డిస్కో రాజాలో నభా నటేష్ పాత్ర గెస్ట్ రోల్ కు ఎక్కువ ఉంది.. హీరోయిన్ కు తక్కువ ఉందని చెప్పుకొంటున్నారు. దానికితోడు డిస్కోరాజా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. రాంగ్ టైమ్ రావడం కూడా డిస్కోరాజాకి పెద్ద మైనస్ అయింది.