పవర్ స్టార్ బన్నీ సినిమాని చూడరు.. ఎందుకంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ సినిమాలు చూడరు. గతంలో పవన్ కల్యాణ్ అభిమానులకి బన్నీ అభిమానులకి మధ్య పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అందరు కలిసిపోయారు. పవన్ నేతృత్వంలోని జనసేనకి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. బన్నీ స్వయంగా వెళ్లి పవన్ ని కలిశాడు కూడా.

బన్నీ సినిమాని పవన్ చూడకపోవడానికి ఇవన్నీ కారణాలు కావు. అసలు పవన్ సినిమాలే చూడలు. ఆయన సినిమాని కూడా చూడరు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ తెలిపారు. ఇటీవల జరిగిన అల.. వైకుంఠపురంలో సక్సెస్ మీట్ లో.. పవన్ కల్యాణ్ అల.. సినిమాని చూశారా ? అనే ప్రశ్న త్రివిక్రమ్ కి ఎదురైంది. దానికి త్రివిక్రమ్ సరదాగా బదులిచ్చారు.

పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారని.. ఈ టైమ్ లో ఆయన సినిమాలు చూడరు. అసలు పవన్ తన సినిమాలనే చూసుకోరు. ఎప్పుడో మూడు నెలల తర్వాత చూసుకోవాలనిపిస్తే చూస్తారు. ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ అయిన 120 రోజుల తర్వాత చూశారని చెప్పారు. అందుకే ఆయన అల.. సినిమాని ఇప్పట్లో చూసే అవకాశమే లేదని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.