మహేష్ సినిమాలో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలని ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తారక్ తదుపరి సినిమా త్రివిక్రమ్ సినిమాలో ఉండనుంది. ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుందని చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాల కోసం కొరటాల శివ, లోకేష్ కనకరాజు (ఖైదీ దర్శకుడు) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదీ పాన్ ఇండియా సినిమాగా రాబోతుందని చెబుతున్నారు.

ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా మొదలైంది. పూరి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా (ఫైటర్) షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక వంశీపైడి పల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అని చెబుతున్నారు. ఇందులో మహేష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తారని.. విజయ్ దేవరకొండని ఓ కీలక పాత్ర కోసం తీసుకోనున్నారని చెప్పుకొంటున్నారు.
  
ఈ విషయం పై విజయ్, మహేష్ లతో దర్శకుడు వంశీ పైడిపల్లి.. డిస్కషన్లు జరపడం.. అందుకు ఇద్దరూ ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందట. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందట. అయితే మహేష్ స్పై గా కూడా కనిపించబోతున్నాడు అనే వార్త కూడా ప్రచారంలో ఉంది. మహేష్, విజయ్ దేవరకొండ తెరని పంచుకోవడం అనేది కొత్తగా అనిపిస్తోంది. ఇది అభిమానులకి కిక్కునిచ్ఛే న్యూసే.