విశాఖ రాజధానికి అనుకూలం కాదు.. ప్రభుత్వ స్పందన ఏంటంటే ?

ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఏపీ శాసన సభ ఆమోదించింది. మండలికి వెళ్లిన ఈ బిల్లుని చైర్మన్ సెలక్టివ్ కమిటీకి పంపించారు. ఈ నేపథ్యంలో మండలి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించింది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుంది అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

మరోవైపు, విశాక రాజధానికి అనుకూలం కాదు. విశాఖకి తుఫాన్ల బెదడ పొంచి ఉంటుంది. జీఎన్ రావు నివేదికలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై బుధవారం మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అన్నీ ఆలోచించే రాజధానిపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై హైపర్ కమిటీ చర్చిచింది. హైపర్ కమిటీ నివేదికని పరిగణలోనికి తీసుకొనే ముందుకెళ్లామన్నారు.

ఇక తెదేపా అధినేత చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నరు. ఆయనది రెండు నాల్కల ధోరణి. మండలిలోనూ బాబు అలానే వ్యవహరించారని.. తెదేపా హయాంలో కాకుండా చాలా పద్దతిగా ముందుకెళ్టున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఇక మండలి రద్దు తీర్మాణం మంగళవారమే కేంద్రానికి చేరింది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పటిలోగా నిర్ణయం చెబుతుందన్నది చూడాలి.