మేకింగ్ వీడియోలని నమ్ముకున్న డిస్కోరాజా

సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన వచ్చిన తొలి స్టార్ హీరో సినిమా డిస్కోరాజా.  వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రమిది. నభా నటాషా, పాయల్ రాజ్ పుత్ కథానాయకులు. ఎస్ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన డిస్కోరాజా మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ సాదాసీదానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కొనసాగిస్తోంది డిస్కోరాజా చిత్రబృందం. ఏదో ఒక అప్ డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో వరుసగా సాంగ్ మేకింగ్ వీడియోలని వదులుతున్నారు. ఇప్పటికే రమ్ రమ్, నువ్వు నాతో ఏమన్నావో.. మేకింగ్ వీడియోలని విడుదల చేశారు. మరీ.. మేకింగ్ వీడియోలు డిస్కోరాజా మైలేజీని పెంచుతాయోమో చూడాలి.

నిజంగానే డిస్కోరాజా బాగానే ఉన్నాడు. రవితేజ అభిమానులు ఎంజాయ్ చేసే అన్ని అంశాలు ఉన్నాయి. ఐతే, రవితేజ అభిమానులు తప్ప.. మిగితా వర్గాలు ఈ సినిమాని చూసే తీరికలో లేరు. ఇటీవలే సంక్రాంతి సీజన్ లోడబ్బులు ఖర్చుపెట్టేశారు. సెలవులు ముగిశాయ్. మళ్లీ పనుల్లో బిజీ అయ్యారు. ఆ ఎఫెక్ట్ డిస్కోరాజాపై పడింది. ర్యాంగ్ టైమ్ రిలీజ్ అంటూ పలువురు హెచ్చరించినా పట్టించుకోకుండా వచ్చిన డిస్కోరాజాకు డ్యామేజ్ తప్పలేదని తెలుస్తోంది.