‘జాను’ ట్రైలర్.. గుండెల్ని పిండేస్తోంది !

శర్వానంద్-సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇదో ప్రేమకథ అన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వచ్చిన 2000దశాబ్ధంలోనే బెస్ట్ ప్రేమకథా చిత్రంగా నిలిచింది. ఆ మేజిక్ తెలుగులోనూ రిపీట్ కాబోతున్నట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. గుండెల్ని పిండేసేలా ట్రైలర్ ఉంది.

ఆ మాటలున్నాయి. శర్వా, సామ్ ల నటనక్ ముగ్దులు కావాల్సింది. స్కూల్ నుంచి వివిధ దశలో వాళ్ల ప్రేమకి సంబంధించిన బిట్ సీన్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. ముఖ్యంగా స్కూల్, పెద్దయ్యాక కూడా ప్రేయసి టచ్ చేస్తే గుండె ఆగిపోయినంత రియాక్షన్ ఇచ్చిన శర్వా నటన ట్రైలర్ కే హైలైట్. ఇక సామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది జీవించేసింది. జాను తెలుగు ప్రేక్షకులని, మరీ ముఖ్యంగా ప్రేమికులని ఏడిపించేందుకే వస్తున్నట్టు స్పష్టం అవుతోంది. జాను ట్రైలర్ ని మీరు చూసేయండీ.. !