సస్పెన్షన్’పై ప్రశాంత్ కిషోర్ షాకింగ్ రియాక్షన్

జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సీఏఏ వ్యవహారంలో పార్టీ స్టాండ్ ని ప్రశాంత్ కిశోర్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దానికితోడు.. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న జేడీయూని ఇరుకున పెట్టే విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహార శైలి ఉంది. ఇటీవల ఆయన ఎన్ డీయే వర్గాలతో కలిసి పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ కి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహా కర్తగా పనిచేస్తున్నారు.

అది బీజేపీకి, బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు మింగుడుపడలేదు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఇష్టం ఉంటేనే పార్టీలో ఉండొచ్చు. లేదంటే వెళ్లొచ్చు అన్నారు. అక్కడితో ఆగకుండా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకే ప్రశాంత్ కిషోర్ ని పార్టీలోకి తీసుకున్నానని అన్నారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. వివాదం మరింగా ముదిరింది.
 
ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ పై జేడీయూ సస్పెండ్ వేటు వేసింది. పార్టీ చర్యకు ప్రశాంత్ కిషోర్ ఏమీ షాక్ కాలేదు. సస్పెండ్ చేసినందుకు నితీష్ కుమార్ కు ట్విట్టర్ వేదిక గా థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు.. నితీష్ కుమార్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. బహుశా.. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రశాంత్ కిషోర్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచించే పనిని మొదలెడతారేమో.. !