ఆ నలుగురికి అన్యాయం చేస్తున్న కెఎల్ రాహుల్
టీమిండియాని నెం.4 చాన్నాళ్లుగా వేధిస్తోంది. వన్డే వరల్డ్ కప్ మిస్ కావడానికి కూడా ఇదే కారణమని క్రికెట్ పండితులు విశ్లేషించారు. ఇక నెం. 4 మాదిరిగా వికెట్ కీపర్ సమస్య కూడా టీమిండియాకు ఉంది. ధోని వికెట్ కీపర్ గా ఉంటే జట్టులో ఓ ధీమా ఉండేది. ఆయన టెస్టుల నుంచి తప్పుకున్నాక.. సాహా కి అవకాశం దక్కింది.
టెస్టుల్లో సాహా అవసరానికి తగ్గట్టుగా ఆడి.. జట్టు అవసరాలని తీర్చాడు. అతడి గాయం కావడంతో ధోని వారసుడిగా మారుమ్రోగిన రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు. పంత్ ఎగసిపడిన కెరటంలా ఆదిలో మెరిపించి తర్వాత నిలకడలేమితో నిరాశపరిచాడు. పంత్‌కు అసాధారణమైన ప్రతిభ ఉంది. కాస్త కుదురుకునే సమయం ఇస్తే అతడో మ్యాచ్ విజేత అవుతాడని భారత ఆటగాళ్లు, మాజీల నుంచి ఈ మాటలు తరుచూ వినిపించాయి.
ఇప్పుడు మాత్రం రాహుల్‌తోనే కీపింగ్ చేయిస్తాం. అలా చేస్తే మరో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకోవచ్చని కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి చెబుతున్నారు. దీంతో జట్టులో స్థానం దక్కడం పంత్ కి కష్టంగా కనిపిస్తోంది. ఇక కె ఎల్ రాహుల్ బ్యాటింగ్ లోనూ, వికెట్ కీపింగ్ లోనూ మెరిసినా.. ఆయన పంత్, సంజు శాంసన్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్, ఇషాన్ కిషాన్ వంటి వారికి అన్యాయం చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. టీ20లో కె ఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం ఓకే. కానీ, వన్ డే లో అది సత్ఫలితాలి ఇవ్వకపోవచ్చని కొందరు అభిప్రాయడుతున్నారు. ఇదీగాక.. ఇన్నాళ్లు టీ20 వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని పంత్ చాలా అవకాశాలిచ్చారు. పేలవ ఫామ్ లో ఉన్న పంత్ విండీస్ టూర్ లో కాస్త కుదురుకున్నట్టు కనిపించాడు.
వెస్టిండీస్ తో తొలి వన్డేలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ (71) ఆడాడు. ప్రతికూల పరిస్థితుల్లో శ్రేయస్‌తో కలిసి 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో కూడా జట్టు అవసరాలను బట్టి దూకుడుగా ఇన్నింగ్స్ (16 బంతుల్లోనే 39) ఆడాడు. దీంతో పంత్ గాడిలో పడ్డాడని భావించారు.
ఐతే, ఆస్ట్రేలియా సిరీస్ లో పంత్ కంకషన్‌కు గురయ్యాడు. ఇది అతడిని జట్టు నుంచి దూరం చేసింది. మరీ.. పంత్ కి మళ్లీ జట్టులో ఎప్పుడు అవకాశం లభిస్తోందో.. ? ఒకవేళ లభించిన ఆయన జట్టులో స్థానం కోసం ప్రత్యర్థులతో పాటు జట్టులోని కె ఎల్ రాహుల్ తో పోరాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ? కె ఎల్ రాహుల్ ని మించిన ఫామ్ ని కొనసాగించాలి. మరీ.. అంత ఓపిక యువ వికెట్ కీపర్ లో ఉందా ? అనేది చూడాలి.