కేసీఆర్’కు భాజాపా శాపనార్థాలు

సీఎం కేసీఆర్ కు భాజాపా నేతలు శాపనార్థాలు పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ పతనానికి నాంది పడనుందని తెలంగాణ భాజాపా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఛైర్మన్ పీఠాన్ని అనూహ్యంగా తెరాస దక్కించుకుంది. అక్కడ భాజాపాకు ఆధిక్యత ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్టుతో తెరాస చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

దీనిపై లక్ష్మణ్ మండిపడ్డారు. తుక్కుగూడలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్..  ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ అక్రమంగా తుక్కుగూడ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకొని ప్రజా తీర్పును తెరాస అవమానించిందని ఆయన ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ పతనానికి ఈ మున్సిపాలిటీ నాంది కాబోతోందన్నారు. తుక్కుగూడ ఛైర్మన్ పదవి నైతికంగా భాజపాదేనని, అధికారం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

లక్షణ్ బాధని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే భాజాపా పలుచోట్ల కాంగ్రెస్ తో మద్దతు పెట్టుకుంది. దాన్ని అనైకం అనరేమో లక్ష్మణుడికే తెలియాలి. ఇక పనిలో పనిలో లక్ష్మణ్ ప్రధాని మోడీ జపం కూడా చేశారు. మోదీ నిర్ణయాలే భాజపాకు అతిపెద్ద బలమని లక్ష్మణ్‌ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారని, ఓవైసీతో దోస్తీ కోసమే సీఎం కేసీఆర్‌ సీఏఏను వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు