నాగశౌర్య జీవితంలో ఏడుగురు అమ్మాయిలు
యంగ్ హీరో నాగశౌర్య ఏకంగా ఏడుగురు అమ్మాయిలతో ప్రేమలో పడ్డారట. అసలే సిగ్గరి. ఆయనకి రొమాన్స్ చేయడం రాదని హీరోయిన్ సమంత లాంటోళ్లు ఆటపట్టిస్తారు. అలాంటి నాగశౌర్య జీవితంలో ఏడు లవ్ స్టోరీలు అంటే నమ్మబుద్దికావడం లేదు కదూ.. ! నమ్మకండీ. కానీ ఇది నిజం. కాకపోతే.. ఈ లవ్ స్టోరీల వ్యవహారం సినిమాలో మాత్రమే. అవునూ.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ సినిమా రాబోతుంది.
ఇది ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా టైప్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగశౌర్య పాత్రలో ఏకంగా ఏడు కోణాలుంటాయట. అవేంటన్నది చాలా ఆసక్తికరం. చేస్తే.. అలాంటి ప్రేమకథలే చేయాలని నిర్ణయించుకున్నానని అశ్వద్థామ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగశౌర్య తెలిపారు. అంతేకాదు.. రాఘవేంద్రరావు నిర్మాణంలో క్రిష్ దర్శకుడిగా ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం తర్జనభర్జనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఇక నాగశౌర్య తాజా చిత్రం ‘అశ్వద్థామ’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి నాగశౌర్య కథ అందించారు. మెహ్రీన్ కథానాయిక. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలని పెంచేసిన అశ్వద్థామకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాపై నాగశౌర్య భారీ అంచనాలు పెట్టుకొన్నాడు. భారీగా ఖర్చు చేశారు. అశ్వద్థామ హిట్ అయితే.. ఇకపై నాగశౌర్య హీరోగా, రచయితగా కొనసాగడం ఖాయం.