‘వి’ కోసం ‘జెంటిల్ మేన్’ ఫార్ములా


నేచురల్ స్టార్ నానిని రాక్షసుడు అంటున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ‘వి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాని రాక్షసుడుగా, సుధీర్ బాబు రక్షసుడుగా కనిపించబోతున్నారని.. వారికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని కూడా వదిలారు. దీంతో ‘వి’లో నాని విలనీజం చూపించబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చిందని చెప్పుకొంటున్నారు.
 
అసలు నిజం ఏంటంటే ? ‘వి’ సినిమాలో నాని విలన్ కాదట. ఈ సినిమాలో నాని విలన్.. సుధీర్ హీరో అనే మాట అసలు నిజం కాదని ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు దిల్ రాజు టీమ్.. డైరెక్టర్ ఇంద్రగంటి కలిసి ఇలా స్పెషల్ గా పబ్లిసిటీ ప్లాన్ చేశారట.నాని మొదట్లో విలన్ లాగా కనిపించినా చివరికి హీరోగా మారతాడని.. సుధీర్ మొదట్లో హీరోగా కనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ గా మారిపోతాడని అంటున్నారు.

ఇదే ఫార్ములాతో దర్శకుడు ఇంద్రగంటి ‘జెంటిల్ మేన్’ సినిమాని తీసుకొచ్చారు. ఇందులో నాని మొదట్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించినా.. ఆ తర్వాత హీరోయిజం చూపిస్తాడు. ఇప్పుడు వి కోసం మరోసారి ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమివ్వబోతున్నారు. నానికి జంటగా అతిథి, సుధీర్ బాబుకి జంటగా నివేదా కనిపిస్తారని తెలుస్తోంది.