షూటింగ్ లో రజనీకాంత్ కి గాయాలు


సూపర్ స్టార్ రజనీకాంత్ షూటింగ్ లో గాయపడ్డారు. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ పేరిట ఒక ఆంగ్ల ఛానెల్‌ తీస్తున్న డాక్యుమెంటరీలో నటించేందుకు కర్ణాటకలోని గుండ్లుపేట అటవీ ప్రాంతానికి వచ్చారు. గత ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీతో బేర్‌ గ్రిల్స్‌ ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆయనే ప్రస్తుతం రజనీతో డాక్యుమెంటరీ తీస్తున్నారు.

ఈ డాక్యుమెంటరీ షూటింగ్ సమయంలో రజనీకాంత్‌ స్వల్పంగా గాయపడ్డారు. దీనికితోడు ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కు స్థానిక అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్వల్పంగా గాయపడిన రజనీకాంత్ షూటింగ్ నుంచి వెనుదిరిగారు. తనకి కేటాయించిన అతిథి గృహానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే..  ప్రస్తుతం రజనీ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.