సామ్ మరింత ఫ్రెష్’గా !


సమంత అందం రోజు రోజుకి రెట్టింపు అవుతున్నట్టుంది. ఆమె మరింత అందంగా కనిపిస్తున్నారు. శర్వానంద్ కి జంటగా ఆమె నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు. ఫిబ్రవరి 7న జాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి సమంత, శర్వా, దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంతని చూసిన జనాలు షాక్ కి గురయ్యారు. ఆమె మరింత ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. జాను షూటింగ్ పూర్తయి చాన్నాళ్లవుతుంది. కాస్త విశ్రాంతి దొరకడంతో సామ్ ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. కాస్త బొద్దుగా తయారయ్యారు.

సమంత తల్లి కావాలని ఆశపడుతుందని.. ఇందుకోసం సినిమాలకి బ్రేక్ ఇవ్వనుందనే ప్రచారం జరిగింది. తాజాగా సామ్ ఫిజిక్ చూస్తే.. తల్లి కావడానికి రెడీ ఉన్నట్టు అనిపిస్తోంది. దానికోసం నోరు కట్టేసుకోకుండా కడుపునిండా తింటోందని అర్థమవుతోంది. మరీ.. సామ్ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారన్నది చూడాలి.