అక్కడ ఎంజాయ్ చేసిన శృతిహాసన్


హీరోయిన్ శృతిహాసన్ మంగళవారం పుట్టినరోజు వేడుకని ఘనంగా జరుపుకుంది. ముందస్తు ప్లాన్ తో ఆమె లండన్ చెక్కేసింది. అక్కడే బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన స్నేహితులతో కలిసి లండన్‌ రోడ్లపై చక్కర్లు కొట్టిన ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘నా హ్యాపీ బర్త్‌ డే డ్యాన్స్‌.. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. అందుకే ఈ కుప్పిగంతులు’ అనే క్యాప్షన్‌తో లండన్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలని షేర్‌ చేసింది శృతిహాసన్. అదేవిధంగా తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులకు, సన్నీహితులకు, తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం శృతిహాసన్ ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. బలుపు తర్వాత గోపీచంద్ మలినేని, రవితేజ శృతి కాంబో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపై హీరోయిన్ గా బిజీ కావాలని ఆశపడుతున్న శృతిహాసన్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తోంది.