హైదరాబాద్ లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ అనుమానితులు

కరోనా వైరల్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో బయటపడిన ఈ వైరల్ తో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ సోకి చైనాలో వందల మంది చనిపోయారు. కరోనా వైరస్ నేపథ్యంలో చైనా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. విందు, వినోదాలకి బ్రేక్ ప్రకటించింది. విద్యా సంస్థలకి సెలవులు ఇచ్చింది. మరోవైపు, కరనో వ్యాధి గ్రస్థుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని జెడ్ స్పీడుతో నిర్మిస్తోంది. 

మరోవైపు, కరనో వైరస్ తో ప్రపంచ దేశాలు అప్రమత్తయ్యాయి. మనదేశంలోని అనీ ఎయిర్ పోర్టులలో కరనో అనుమానుతులని గుర్తిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పట్ల అప్రమత్తం అయింది. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, గాంధీ తదితర ఆసుపత్రిల్లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే కేంద్ర ఆరోగ్య బృందం హైదారాబాద్ కి చేరుకుంది. మంగళవారం ఈ బృందం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా వైరల్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు బాగున్నాయని కేంద్ర వైద్య బృందం తెలిపింది. ఈరోజు గాంధీ ఆసుపత్రిని వైద్య కేంద్రబృందం పరిశీలించింది. దాదాపు రెండు గంటల పాటు గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు.

కరనా వైరస్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఏర్పాట్ల విషయంలో కేంద్ర వైద్య బృందం పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. బెడ్ బెడ్ కి ఎంత దూరం ఉండాలి. కరోనా అనుమానులకి ఎలాంటి చికిత్స అందించాలని వివరించారు. ఇక హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో మరో ఐదుగురు కరోనా అనుమానితులు చేరారు. వారి బెడ్ శాంపిల్స్ ని పూణెకి పంపించారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు.