కరోనా వైరస్’కి మందు కనిపెట్టిన భారత్
భారతదేశానికి ఔషద జ్ఝానం ఎక్కువని మరోసారి నిరూపితం అయింది. ప్రపంచదేశాలని వణికిస్తోన్న కరోనా వైరస్ కు భారత ఆయుష్ కనుగొన్నది. ఈ మేరకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. కరోనా వైరస్ వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటానికి హోమియోపతి, యునానీ ఔషధాలు మంచివని సూచించింది. హోమియోపతి మందు ‘ఆర్సెనికం ఆల్బమ్ 30’ ను ఖాళీ కడుపుతో మూడు రోజుల పాటు తీసుకోవటం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ మందు రోగనిరోధక ఔషధంగా పనిచేస్తుందని వారి వివరించారు.
గాలి ద్వారా వ్యాప్తించే వ్యాధులను అడ్డుకునేందుకు వాడే సాధారణ రక్షణ విధానాలను కూడా పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో కనీసం 20 సెకెండ్ల పాటు కడుక్కోవటం, అపరిశుభ్రమైన చేతులతో కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోకపోవటం, అనారోగ్యానికి గురైన వారికి దగ్గరగా వెళ్లకపోవటం వంటి ముందు జాగ్రత్త చర్యలతో కరోనావైరస్ను కొంతవరకు నిరోధించవచ్చు భారత్ ఆయుష్ తెలిపింది. మరీ.. భారత్ ఆయుష్ సూచనలని చైనా దేశం పరిగణలోనికి తీసుకొని అమలు చేస్తుందేమో చూడాలి.