‘రెడ్’ పిల్ల మరో సమంతలా ఉందే.. !


‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు ఎనర్టిటిక్ హీరో రామ్. ఆయన తాజా చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకుడు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రామ్ ‘రెడ్’ లుక్ బయటికొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రెడ్ హీరోయిన్ అమ్రిత అయ్యర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

అమ్రిత అయ్యర్ క్యూట్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఏం మాయ చేశావె సినిమాలో సమంత లా కనిపిస్తోంది. లుక్ లోనే కాదు.. నటనలోనూ అమ్రిత సమంతని మైమరిపిస్తే.. స్టార్ హీరోయిన్ గా ఎదిగినట్టే. ఇక  నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ తర్వాత రామ్, కిషోర్ తిరుమల కాంబో వస్తున్న చిత్రమిది. ఏప్రిల్ 9న ‘రెడ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.