‘డాంగ్‌ డాంగ్‌’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాన్నాళ్ల తర్వాత మహేష్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఆయన అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. కేవలం 10రోజుల్లోనే రూ. 100కోట్లకిపైగా షేర్, రూ. 200కోట్లకిపైగా గ్రాస్ ని వసూలు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ జోరు చూపించిన సరిలేరు చిత్రబృందం.. ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చింది. తాజాగా మళ్లీ మొదలైంది.

ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా ‘డాంగ్‌ డాంగ్’ అనే పార్టీ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ పాటలో తమన్నా, మహేశ్‌ వేసిన స్టెప్పులు థియేటర్లలో ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయించాయి. తాజాగా ‘డాంగ్‌ డాంగ్‌’ పాట పూర్తి వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఐటమ్ సాంగ్ కి శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ.. దేవిశ్రీ సంగీతం సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. డాంగ్ డాంగ్ ఫుల్ వీడియోసాంగ్ ని మీరు చూసి ఎంజాయ్ చేయండీ.. !