నటి కరాటే కల్యాణిని చిత్రహింసలు పెడుతున్నారట.. పోలీసులకి ఫిర్యాదు !

టాలీవుడ్ నటి కరాటే కల్యాణి వేధింపులని ఎదుర్కొంటున్నారట. ఆమెని లైంగిక వేధిస్తున్నారట. చిత్రహింసలు పెడుతున్నారట. అవి తట్టుకోలేక ఆమె పోలీసులని ఆశ్రయించారు. పొద్దున్నే లేచి ఫోన్ చూడాలంటేనే భయమేస్తోంది. తనని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అశ్లీల వీడియోలు పంపించి చిత్ర హింసలు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో కరాటే కల్యాణి పేర్కొంది.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గత కొన్ని రోజులుగా అభ్యంతరక మేసేజ్ లు వస్తున్నాయి. వీడియోలు పంపిస్తున్నారు. ఇందులో మార్పింగ్ వీడియోలు, శృంగార వీడియోలు ఉన్నాయి. సదరు ఫోన్ నెంబర్లని బ్లాక్ చేసినా.. కొత్త కొత్త  ఫోన్ ల మెసేజ్ లు పంపుతూనే ఉన్నారు. టార్చర్ పెడుతున్నారు. వీరిని గుర్తించి.. కఠినంగా శిక్షించాలని కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులని కోరింది. కేసుని నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.