ఘనంగా ‘టక్ జగదీష్’ ప్రారంభోత్సవం


నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. శివనిర్వాణ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా ఇది. ఇది వరకే ఈ సినిమాపై అఫిషియల్ ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నిన్నుకోరి’ తర్వాత శివనిర్వాణ-నాని కలయికలో రాబోతున్న సినిమా ఇది.

ఈ చిత్రంలో నానికి జంటగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఫిబ్రవరి 11 నుంచి టక్ జగదీష్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శివ నిర్వాణ ఒకేసారి నాని, విజయ్ దేవరకొండలకి కథలు చెప్పి ఓకే చేయించుకున్నారు. ఐతే, ముందు నానితో ఆ తర్వాత విజయ్ తో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకొన్నాడు.