ఈసారి రస్మిక టెంప్ట్ అయిందిగా.. !

హీరోయిన్ రష్మిక మందన నడుం అందాలని చూసి హీరో నితిన్ టెంప్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె నడుంని పట్టేసుకొని చుట్టేసుకోవాలని.. ఆమె వెనకాలే వెళ్లడం బీష్మ మోషన్ పోస్టర్ లో చూశాం. వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్-రస్మిక జంటగా నటిస్తున్న చిత్రమిది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 21న భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా #WhatteyBeauty లిరికల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 4:05గంటలకి ఈ సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వదిలిన ఓ పోస్టర్ లో రస్మిక నితిన్ నడుంని గట్టిగా పట్టేసుకుంది. దీంతో.. ఈసారి రస్మిక టెంప్ట్ అయినట్టుందని చెప్పుకొంటున్నారు.