లైవ్ : ‘అల.. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్’ థ్యాంక్స్ మీట్


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోలందరినీ దాటుకొని వచ్చి ప్రభాస్ వెనకాల నిల్చున్నాడు. టాలీవుడ్ వసూళ్లలో ‘బాహుబలి’తో నెంబర్ వన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెలకొల్పిన రికార్డులన్నీ అల.. వైకుంఠపురంలో బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అల.. చిత్రబృందం ఆల్ టైం ఇండస్ట్రీ పేరిట థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఆల్ టైం ఇండస్ట్రీ  హిట్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో ఏరియాల వారీగా అల.. నాన్ బాహుబలి రికార్డులని చేయడానికి పేర్కొన్నారు. అన్ స్టాపబుల్ రికార్డ్. విశాఖపట్నం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నైజాం, సీడెడ్, నెల్లూరు, వెస్ట్ గోదావరిలలో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసినట్టు తాజా ట్రైలర్ లో చూపించారు. ఇక ఈ వేడుకని క్రింది వీడియోని లైవ్ లో చూసేయండీ.. !