దేశవ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు.. ఆ రెండు బ్యాంకులే పని చేస్తున్నాయ్ !


దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ అయ్యాయి. ఏకంగా మూడ్రోజుల పాటు బ్యాంకుల బంద్ కొనసాగనుంది. సమస్యల పరిష్కారం కోసం జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లడమే ఇందుకు కారణం. మొత్తం 60వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. నవంబరు 2017 నుంచి వేతన సవరణ పెండింగులో ఉంది.

ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ 20 సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకి దిగారు. సమ్మె నేపథ్యంలో శుక్ర, శనివారాలు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎల్లుండి ఆదివారం కావడంతో.. ఆ రోజు బ్యాంకులు బందే. ఐతే, ఈమూడ్రోజులు పాటు ప్రయివేటు బ్యాంకులు అయినా.. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు సమ్మె ప్రభావం లేదు. ఈ రెండు బ్యాంకులు పనిచేయనున్నాయి.