జనగామ జిల్లా : ఖిలాషాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

జనగామ జిల్లా రఘునాథపురం ఖిలాషాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖిలాషాపూర్‌లోని తారా ఇండస్ట్రీస్ టిన్నర్ పరిశ్రమలో రియాక్టర్లకు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించాయి. క్షణాల్లో కంపెనీ మొత్తం అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్థినష్టం జరిగింది.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరగగానే.. సిబ్బంది బయటికి పరుగులు పెట్టడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఐతే, కంపెనీ మొత్తం అగ్నికి ఆహుతై పోయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసేందుకు రెడీ అవుతున్నారు.