త్వరలోనే చనిపోతా.. హీరోయిన్ షాకింగ్ పోస్ట్ !
టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత షాకింగ్ పోస్ట్ చేసింది. త్వరలోనే తాను చనిపోతానని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి కాస్త వివరణ కూడా ఇచ్చింది. దానికి తన అనారోగ్య కారణాలే కారణమన్నట్టుగా రాసుకొచ్చింది. ఇంతకీ మాధవీలత ఏమన్నారంటే.. ?
“నేనెపుడు నా ఫ్రెండ్సుతో చెప్తూ ఉంటాను. ఎదో ఒక రోజు “ప్రేమ” సినిమాలో రేవతిల చచ్చిపోతా అని. అందులో కూడా తాను ఎపుడు ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా పోతది నేను అంతేనేమో. ఎపుడు నన్ను ఏడిపించే 3 విషయాలు.. మైగ్రేన్ తలనొప్పి, జలుబు&జ్వరం, నిద్రలేమి వీటికోసం మందులు వేసుకుంటాను. మందులు వేసుకోవడం నాకు అసహ్యం. కలలున్నాయి. కోరికలున్నాయి.. ఆశలున్నాయి ఈ మందులు నా ఆయుష్షు ఉంచవేమో” అంటూ రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ చూసి ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఆ విధంగా ఆలోంచించవద్దని సలహాలు ఇస్తున్నారు. బీ పాజిటీవ్ అని, జీవితంలో ఎవరికైనా ఇలంటి కష్టాలు కామన్ అని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. నచ్చావులే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది మాదవీలత. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా.. బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆమె సినిమాలకి దూరంగానే ఉంటున్నారు.