బిల్‌గేట్స్‌ను కలిసిన హాట్ బ్యూటీ

గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌ ఇటీవల మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. ఇటీవల వాషింగ్టన్‌లో అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఏర్పాటు చేసిన ఒక పార్టీలో ఆమె పాల్గొన్నారు. ఆ పార్టీలో భాగంగా ఆమె బిల్‌గేట్స్‌ను కలిశారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా మల్లికా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.

‘బిల్స్‌గేట్స్‌ను కలిసి మహిళా సాధికారత గురించి మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది’ అని మల్లికా పేర్కొన్నారు.బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మర్డర్‌’, ‘గురు’ ‘ప్యార్‌ కి సైడ్‌ ఎఫెక్ట్స్‌’, ‘హిస్‌’ ‘టైమ్‌ రైడర్స్‌’ చిత్రాల్లో నటించి మల్లికా శెరావత్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌13’లో కూడా ఆమె సందడి చేశారు. హాలీవుడ్ లోనూ మల్లికా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.