స్లిమ్ లుక్’లోకి నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు బాగా తగ్గాడు. భారీకాయం నుంచి స్లిమ్ లోకి మారాడు. ఇందుకోసం ఏకంగా ఆరు నెలలు కష్టపడ్డానని తెలిపాడు. తాజాగా నాగబాబు తన ఫేస్ బుక్ ఖాతాలో మూడు ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో బరువు తగ్గిన ఫొటోలతో పాటు అంతకు ముందు తాను లావుగా ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. సన్నగా ఉండడమే ఆరోగ్యానికి మేలని తెలిపాడు. తనకు బరువు తగ్గడానికి ఆరు నెలలు పట్టిందని తెలిపాడు.
బరువు తగ్గడానికి ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడం.. వయసు, ఎత్తుకు తగ్గ బరువు మెయిన్ టెయిన్ చేయాలంటూ నాగబాబు తాను పాల్గొంటున్న షోల్లో నటీనటులకు సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు ఆయన కూడా వాటిని అనుసరించి స్లిమ్ గా తయారయ్యాడు. నవ్వుల బాబు కొత్త లుక్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే.. హీరోగా సినిమాలు చేయబోతున్నారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.