’30రోజుల్లో ప్రేమించడం ఎలా ?’ తొలిసాంగ్ వచ్చేసింది !
యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ సరసన అమ్రిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మ్యూజికల్ పోస్ట్‌ర్‌కు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి తొలి వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం నుంచి మొదటి సాంగ్ లాంచ్ చేస్తున్నందకు ఆనందంగా ఉందని మహేష్ తెలిపారు. పాట చాలా బాగుందన్న మహేష్.. ప్రదీప్‌తోపాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ అంటూ సాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. సునీత, సిద్ శ్రీరామ్ పాడారు.