జేడీ రాజీనామాపై పవన్ రియాక్షన్.. అదిరింది !

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పూర్తి జీవితం రాజకీయాలకే అని చెప్పిన పవన్.. తిరిగి సినిమాల్లో నటిస్తుండడం చూస్తుంటే.. ఆయనలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. అందుకే జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలనే నిర్ణయం తీసుకున్నాని జేడీ తెలిపారు. ఈ మేరకు గురువారం రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు. జేడీ రాజీనామాని జనసేన ఆమోదించింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ స్వయంగా పవన్ కల్యాణ్ ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. లక్ష్మీ నారాయణ గారి భావాలని
గౌరవిస్తూన్నామని చెబుతూనే.. ఆయనకి చురకలంటించారు. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక ఉద్యోగం పొందే ప్రభుత్వం ఉద్యోగినీ కాదు. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికోసం, నా కుటుంబం కోసం, పార్టీ ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు పవన్.

జేడీ రాజీనామా విషయంలో సినిమా పరిశ్రమ నుంచి పవన్ కి సంపూర్ణ మద్దతు దొరకడం విశేషం. పవన్ సినిమా చేయడమే సాకు చూపి.. జనసేనకి జేడీ రాజీనామా చేయడం పట్ల సినీ ప్రముఖులు, సినీ విశ్లేషకులు అభ్యంతరం చెబుతున్నారు. సినిమా ఒక కల. ఎందరికో ఒక కల పునరావాసం పొందిన మావోయిస్టు మరల ఉద్యమ దారి పట్ట్టినట్లు ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే సారా వ్యాపారం ఎదో పెట్టినట్లు సినీ కళా రంగము మీద జెడి ఆభిప్రాయంను ఖండిస్తున్నాని అంటున్నారు.