కేంద్ర బడ్జెట్-2020 రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాత్ కోవింద్ ప్రసంగించారు. ఈ దశాబ్దం భారత్‌కు ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ప్రభుత్వం నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్ :
* ఈ ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టింది
* ముస్లిం మహిళలకు న్యాయం చేకూరేలా ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చింది
* అసోంలో బోడో సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతాం
* బోడోల సమస్య పరిష్కారానికి రూ.105కోట్లతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది
* రామజన్మభూమి అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై దేశ ప్రజలు చూపిన ఔన్నత్యం ప్రశంసనీయం.
* దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెడుతోంది.
* అనేక అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత్ ముందంజలో ఉంది.
* సబ్‌కాసాత్, సబ్కా వికాస్ మూల మంత్రంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.
* 2019లో కొన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్35ఏ రద్దు బిల్లుకు ఉభయసభల్లోను మూడొంతుల మెజార్టీతో ఆమోదం లభించింది. ఇది చారిత్రాత్మకమైన విషయం.
* దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పలు కొత్త పథకాలను తీసుకొస్తుంది. ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ యోజన పథకాల ద్వారా పేదల సంక్షేమం కోసం పాటుపడుతోంది.
* కేంద్ర ప్రభుత్వం కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను రికార్డు నెలకొల్పింది. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
* పౌరసత్వ సవరణ చట్టం చారిత్రాత్మక చట్టం. సీఏఏతో బాపు కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. పాక్‌లో నివసించడం ఇష్టం లేని హిందువులు భారత్ రావాల్సిందిగా మహాత్మాగాంధీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏ పేరుతో బాపు కలను సాకారం చేసింది.