రామచిలుకపై ఉపాసన ప్రేమ
రామచిలుకపై మెగా కోడలు ఉపాసన ప్రేమని కనబర్చారు. ఉపాసన జంతు ప్రేమికురాలు అన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమని మరోసారి వ్యక్తం చేసింది ఉపాసన. తాజాగా ఆమె పక్షుల గురించి చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. రామచిలుక ఏపీ రాష్ట్ర పక్షి అని మీకు తెలుసా? రామచిలుకనే కాదు ఏ పక్షినైనా పంజరంలో బంధించడం అక్రమం. ఆరేళ్ల వరకు జైలుశిక్ష కూడా విధిస్తారు. ఇలాంటి విషయాలపై అవగాహన కలిగివుండడం వన్యప్రాణి సంరక్షణలో తొలి అడుగుగా భావిస్తున్నా అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. అంతేకాదు, రామచిలుక శాస్త్రీయనామం ‘సిట్టాక్యులా క్రామెరి’ అని కూడా తన ట్వీట్ లో తెలియజేశారు.
ఇటీవల రామ్ చరణ్, ఉపాసన ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ కోసం ఓ కార్యక్రమానికి తెరదీశారు. అందులో భాగంగానే ఉపాసన ప్రచారం షురూ చేసినట్టు తెలుస్తోంది. ఉపాసన సామాజిక స్పృహ ఎక్కువ. అపోలో ఫౌండేషన్ పేరిట అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆమె పక్షుల రక్షణ కోసం నడుంబిగించింది. వచ్చేసి వేసవి కావడంతో.. పక్షల కోసం ప్రతి ఇంటిపైనా వాటికోసం నీటిని ఉంచితే మంచిదని పక్షి ప్రేమకులు సూచిస్తున్నారు.
Did u know the “Rama Chiluka (psittacula krameri) or rose ringed parakeet” is the state bird of Andhra Pradesh
caging any Indian bird 🦜is illegal & one can receive a punishment of upto 6 years imprisonment
The first step towards protecting wildlife is to be aware!@WWFINDIA pic.twitter.com/QXKYTshpmK
— Upasana Konidela (@upasanakonidela) January 31, 2020