రస్మిక భలే తిప్పింది.. ఊపేసింది !


హీరోయిన్ రష్మిక మందన భలే తిప్పేసింది. ఓ రేంజ్ లో ఊపేసింది. వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్-రస్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 21న భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి #WhatteyBeauty లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. “ఏ.. వాటే వాటే వాటే బ్యూటీ.. నువ్ యాడా వుంటే.. యాడే ఆనే రూటీ. తిప్పుతుంటే నడుమే నాటీ నా కళ్లే కంత్రీ డ్యూటీ.. ” అంటూ సాగే ఈ సాంగ్ కి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ధనుంజయ్, అమల చేబోలు కలిసి పాడారు. మహర్షి స్వరసాగర్ సంగీతం అందించారు.

ఈ పాటలో రస్మిక నడుముని వయ్యారంగా తిప్పింది. పై అందాలని బాగా తిప్పేసింది. నితిన్ ని ముద్దులతో ముంచెత్తించింది. మొత్తంగా క్యూట్ గా కనిపించింది. వెరైటీగా సాగిన సాగిన ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకొనేలా ఉంది. #WhatteyBeauty లిరికల్ సాంగ్ వీడియో ప్రోమోని మీరు చూసి ఎంజాయ్ చేయండీ.. !