పర్సనల్ కారణాలతో.. విప్రో సీఈవో రాజీనామా !
సాఫ్ట్ వేర్ దిగ్గజం విప్రో సీఈవో పదవికి అబిదాలీ నీముచ్ వాలా రాజీనామా చేశారు. కుటుంబపరమైన కారణాలతో ఈ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. “75 సంవత్సరాలకు పైగా గొప్ప చరిత్ర కలిగిన విప్రోకు సేవ చేయటం నాకు లభించిన గౌరవం. మా ప్రయాణంలో మేము గుర్తించదగిన పురోగతిని సాధించాము. మా డెలివరీ విభాగాన్ని అభివృద్ధి చేశాము… కస్టమర్ల వ్యవస్థను వ్యవస్థీకరించాము” అని ఓ ఒక ప్రకటనలో నీముచ్ వాలా తెలిపారు.
అదే సమయంలో ఇన్ని సంవత్సరాలుగా తనకు సహాయ సహకారాలందించినందుకు ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, ఆయన కుమారుడు రిషాద్ ప్రేమ్ జీ, డైరక్టర్లు, సహోద్యోగులు, వినియోగదారులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. గత నాలుగేళ్లుగా అబిదాలీ అందించిన సేవల పట్ల విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, ఆయన కుమారుడు రిషాద్ ప్రేమ్ జీ కృతజ్ఝలు తెలిపారు.నీముచ్ వాలా భవిష్యత్తులో ఆయనకు అంతా మంచి జరగలని ఆకాంక్షించారు. ఇక కొత్త సీఈవో నియామకం జరిగే వరకు అబిదాలీ ఈ పదవిలో కొనసాగుతారు. కొత్త సీఈవో కోసం కంపెనీ డైరక్టర్లు అన్వేషణ సాగిస్తున్నారు