ఇండియాకు భారీ జరిమానా.. ఎందుకంటే ?


టీమిండియా ఐసీసీ షాకిచ్చింది. భారీ జరిమానాని విధించింది. ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత విధించింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో నిర్ణీత సమయంలో ఓవర్లు వేయకపోవడమే (స్లో ఓవర్‌రేట్‌) ఇందుకు కారణం. నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా 2 ఓవర్లు ఆలస్యంగా వేశారు. దీంతో ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున మొత్తం 40 శాతం జరిమానా విధించారు.

ఇక నాల్గో టీ20లోనూ ఫలితం సూపర్ ఓవర్ లో తేలిన సంగతి తెలిసిందే. తొలుత భారత్‌ 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (50) అజేయ అర్ధశతకం సాధించాడు. లోకేశ్‌ రాహుల్‌ (39) ఫర్వాలేదనిపించాడు. అనంతరం 166 పరుగుల లక్ష్య చేదనలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా టైగా మారి సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్‌ ఓవర్లో రాహుల్‌, కోహ్లీ మెరుపులతో భారత్‌ విజయం అందుకుంది.