హీరోయిన్స్ ఇష్టంగానే పడకగదికి వెళ్తున్నారట

సినీ పరిశ్రమలో పడక సుఖం ఇస్తేనే ఛాన్సులు అన్న సాంప్రదాయం కొనసాగుతుందని నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమమే తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ పై గట్టిగానే పోరాడింది. పోరాడుతోంది. ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి.. అక్కడి నుంచి అప్పుడప్పుడు షాకింగ్ ఆరోపణలు చేస్తుంటుంది. శ్రీరెడ్ది తర్వాత అంత బోల్డ్ గా స్పందించిన నటిగా గాయత్రిగుప్తా పేరు తెచ్చుకొంది. ముఖ్యుల పడక కోరికల్ని తీరిస్తే కానీ ఛాన్సులు రావన్న గాయత్రిగుప్తా మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

 టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ఇండస్ట్రీ ఏదైనా కానీ ఛాన్సులు రావాలంటే  దర్శక నిర్మాతలతో పాటు హీరోలతో కూడా కమిట్ కావాల్సిందేనని ఆమె కామెంట్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అన్న మాట పేరుకే కానీ.. ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయరని  కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇష్ట పూర్వకంగానే కమిట్ అవుతున్నారని.. వాళ్లకు అవసరం.. ఎదుటోడి ఆనందంతోనే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఓపెన్ గా మాట్లాడింది.

ఇండస్ట్రీలో  క్యాస్టింగ్ కౌచ్  ఉందన్న విషయం తానెప్పటి నుంచో  చెబుతున్నానని.. అందులో కొందరు హీరోయిన్లు ఇష్టంతో చేస్తున్నప్పుడు కాదనటానికి మనమెవ్వరమంటూ నగ్న సత్యాలని చెప్పింది గాయత్రి గుప్తా. ఇండస్ట్రీ పడకపిలుపులు సహజమే. ఐతే, అవి ఇద్దరి అవసరాలని బట్టీ జరుగుతుంటాయని సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేసింది గాయత్రి. మరీ.. టాలీవుడ్ ఏ రేంజ్ హీరోయిన్స్ పడకగదులకి వెళ్తుంటారు అనే లోతుల్లోకి మాత్రం ఆమె వెళ్లలేదు.