చైనా నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు

చైనాలో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తున్న సంగతి తెలిసిందే.  చైనాలో కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సులో 600 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు శుక్రవారం కేంద్రం ప్రత్యేకంగా ఓ ఎయిరిండియా విమానాన్ని వుహాన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ ఉదయం 324 మంది భారత్‌కు చేరకున్నారు.

వీరికి తొలుత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని పరీక్షిస్తారు. అనంతరం మానేసర్‌ కేంద్రానికి తరలించి క్షుణ్నంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తమైతే.. వారిని వెంటనే ‘బేస్‌ హాస్పిటల్‌ దిల్లీ కంటోన్మెంట్‌ కు తరలిస్తారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారిని బీహెచ్‌డీసీకి పంపుతారు. వైరస్‌ సోకిన లక్షణాలు లేనివారిని కూడా మానేసర్‌లోనే ఉంచుతారు. వారికి ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజుల తర్వాత కూడా వారిలో వైరస్‌ లక్షణాలేవీ కనిపించకపోతే స్వస్థలాలకు పంపిస్తారు. ఇక చైనాలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 259 మంది మరణించారు.