కేంద్ర బడ్జెట్ పై మోడీ ఆధునిక మాట

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారపక్షం మాత్రం ఇది సామాన్యుడి బడ్జెట్ అని.. యేడాదిలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మీడియాతో మాట్లాడారు. “నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయి. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్‌ భారత్‌ కొత్త దశను నిర్దేశిస్తుంది. దేశంలో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలున్నాయి. బడ్జెట్‌లో స్మార్ట్‌ సిటీలు, డేటా సెంటర్‌ పార్కులు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధాని అన్నారు.