పవన్ మూడు సినిమాలు.. రేణు ఎందులో !

రాను రాను అంటూనే మళ్లీ సినిమాల్లోకి వచ్చేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వచ్చి రాకతోనే టాప్ గేర్ వేసేశాడు. ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టేశాడు. వీటిలో రెండు సినిమాలని అప్పుడే పట్టాలెక్కించాడు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. దీనితోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాకు సంతకం చేశారు. తాజాగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పవన్‌ ఓ సినిమాలో నటిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది.

ఈ నేపథ్యంలో పవన్‌ నటించే ఓ సినిమాలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ నటించబోతుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండనుందట. తల్లి పాత్రలు చేసేందుకు ఇప్పటికే రేణూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పింక్ రిమేక్ లో ఓ తల్లి పాత్ర ఉంది. అది సినిమాలో చాలా కీలక పాత్ర. దీంతో తెలుగు పింక్ లో రేణు దేశాయ్ కనిపించబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక గబ్బర్ సింగ్ కాంబో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ రేణు కోసం ఓ పవర్ ఫుల్ పాత్రని క్రియేట్ చేశారని చెప్పుకొంటున్నారు. క్రిష్ సినిమాలోనూ రేణుకి స్థానం దక్కనుందని చెబుతున్నారు.

ఇంతకీ పవన్ నుంచి వస్తున్న మూడు సినిమాల్లో రేణు ఏ సినిమాలో కనిపిస్తారు. అసలు ఏదో ఒక సినిమాలోనైనా కనిపిస్తారా ? లేక మూడు సినిమాల్లోనూ రేణు ని తీసుకొని పవన్ అభిమానులని సప్రైజ్ చేస్తారా..  ? లేక పవన్-రేణూ కాంబో రిపీట్ అనేది గాసిప్ గానే మిగిలిపోతుందా ? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులో ఆగాల్సిందే. గతంలో పవన్‌ -రేణు దేశాయ్‌ కాంబిలో ‘బద్రి’,  ‘జానీ’ సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే.