ఒంపుసొంపుల నిధి


నిండైన అందాలు హీరోయిన్ నిధి అగర్వాల్ సొంతం. వాస్తవానికి వాటితోనే నెట్టుకొస్తుంది. నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నిధి అగర్వాల్. ఆ తర్వాత చైతూ తమ్ముడు అఖిల్ అక్కినేనితో ‘మిస్టర్ మజ్ఝ్ను’లో సందడి చేసింది. అక్కినేని బ్రదర్స్ ఇద్దరు నిధిని సంతృప్తిపరచలేకపోయారు. ఆమెకి హిట్ ఇవ్వలేకపోయారు.

ఎనర్జిటిక్ హీరో రామ్ మాత్రం నిధి కోరిక తీర్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ఇచ్చాడు. పూరి-రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.

గ్లామర్ పాత్రలకి ఫర్ ఫెక్ట్ గా సరిపోయే నిధి అగర్వాల్ స్టార్ హీరోల సినిమాల కోసం వెయిట్ చేస్తోంది. ఇందుకోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా నిధి చేసిన ఓ ఫోటో షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో మాదిరిగా ఇందులో ఎద అందాలని హైలైట్ చేయడకుండా.. నిది నడుం అందాలని హైలైట్ చేశారు.

నిధి ఒంపుసొంపులు చూసి.. కుర్రకారుకి పిచ్చెకి పోవాల్సిందే. ప్రస్తుతం నిధి అగర్వాల్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ ఎంట్రీ ఇస్తున్న సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో జయంరవి కథానాయకుడిగా నటిస్తున్న భూమి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.