శర్వా నచ్చిన అమ్మాయి

కథల ఎంపికలో మంచి అభిరుచి ఉన్న కథానాయకుడు శర్వానంద్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. విజయాలు అందుకుంటాడు. ఆయన తాజా చిత్రం ‘జాను’. సమంత కథానాయిక. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టారు. ట్రైలర్ ని వదిలారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. 96 మేజిక్ మరోసారి రిపీట్ కానుందనే నమ్మకంతో జాను చిత్రబృందం ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శర్వానంద్ తన పెళ్లిపై స్పందించారు. పెళ్లెప్పుడు ? ఎలాంటి అమ్మాయి కావాలి ?? అని అడిగితే.. సమంత లాంటి అమ్మాయి కావాలి. మజిలీ సినిమాలో సమంత లాంటి అమ్మాయి కావాలని సూటిగా చెప్పాడు. భర్తని అంత బాగా చూసుకునే భార్య కావాలన్నది శర్వా అభిప్రాయం.