సూపర్ ఫామ్ లో రాహుల్.. అయినా చోటు లేదు !
సూపర్ ఫామ్ లో ఉన్న కె ఎల్ రాహుల్ కి నిరాశే ఎదురైంది. కివీస్ తో టెస్ట్ సిరీస్ ని అతడిని ఎంపిక చేయలేదు. తాజాగా కివీస్ తో వన్డే, టెస్ట్ సిరీస్ లకు బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది. యువ బ్యాట్స్ మెన్స్ శుభ్ మన్ గిల్, పృథ్వీషాలు చోటు దక్కించుకున్నారు. యువపేసర్ నవదీప్ సైనికి చోటు దక్కింది. మరోవైపు రంజీలో గాయపడిన ఇషాంత్ శర్మను కూడా జట్టులోకి ఎంపిక చేశారు.
చివరి టీ20లో గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో వన్డే సిరీస్ కు మయాంక్ అగర్వాల్ కు అవకాశం ఇచ్చారు. టెస్టుల్లో కొత్త జంట ఓపెనింగ్ చేయనున్నారు. మయాంక్ అగర్వాల్, పృధ్వీ షాలు ఓపెనర్స్ గా దిగనున్నారు. అంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ భారీ మార్పులు ఉంటాయని కెప్టెన్ కోహ్లీ తెలిపారు. రాహుల్ ని ఆరోస్థానంలో దించే అవకాశాలున్నాయి.
భారత జట్టు (వన్దే): విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,రాహుల్ ,పృథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , శివమ్ దూబే , మనీష్ పాండే , కుల్దీప్ యాదవ్ , చాహల్ ,సైనీ , బుమ్రా , శార్దూల్ ఠాకూర్ ,షమీ ,రవీంద్ర జడేజా ,కేదార్ జాదవ్,మయాంక్ అగర్వాల్
భారత టెస్టు జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,పృథ్వీ షా , మయాంక్ అగర్వాల్ ,రిషబ్ పంత్ , పుజారా , రహానే , సాహా ,హనుమ విహారి ,అశ్విన్ , బుమ్రా ,షమీ , ఉమేష్ యాదవ్ ,రవీంద్ర జడేజా ,గిల్ , సైని ,ఇషాంత్ శర్మ